Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2025, 3:48 pm Posted by : ramakrishna

ఆప్ పార్టీ ఓటమిపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు

డిల్లీ, బతుకమ్మ :   డిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఓటమిపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. మద్యం విధానం కారణంగా  ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. మద్యం దుకాణాలను ప్రోత్సహించి, ప్రజల అవసరాలను గుర్తించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శలు చేశారు.  ప్రజలకు సేవ చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని పక్కన బెట్టి ప్రయాణించడమే ఆప్ పార్టీ చేసిన తప్పిదమని వ్యాఖ్యనించారు.