. . . పీఆర్ టీయు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
శ్రామిక వర్గాల హక్కుల పరిరక్షణకు జీవితాంతం పోరాడిన నాయకుడు, విద్య ద్వారానే ప్రతి వ్యక్తి సాధికారత సాధించగలడనే సందేశాన్ని సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు అన్నాభావు సాఠే అని పీఆర్ టీయు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి కొనియాడారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో అన్నాభావు సాఠే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభావు సాఠే విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ డి. రాజేశ్వరి పుష్పమాల వేసి నివాళులర్పించి, జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అన్నాభావు సాఠే సామాజిక విప్లవకారుడని, ప్రముఖ రచయితగా సమాజంలో కుల వివక్ష నిర్మూలనకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తవత్సలం ఢిల్లీ, మురళి తదితర ప్రముఖులు పాల్గొని అన్నాభావు సాఠే సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమం సందర్భంగా ఆయన ఆశయాలను అనుసరిస్తూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు.
