- నుడా చైర్మన్ కేశవేణు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బడికి వెళ్లి చదువుకోకుండానే ఏకలవ్య శిష్యుడుగా సామాజానికి వెలుగు దారి చూపెట్టిన, సాహిత్య సామ్రాట్ గా దేశంలో పేరు గడించిన ఒకే ఒక్కడు లోక్ షాహిర్ అన్నా బాహుసాటే అని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. అన్నా బాహుసాటే జయంతి సందర్భంగా నగరంలోని చంద్ర శేఖర్ కాలనీలోని బై పాస్ రోడ్డు చౌరస్తాలో శుక్రవారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కేశవేణు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివక్షను ఎదుర్కొంటూ బడికెళ్లి చదువు నేర్చుకున్న మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులని అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సంఘ శ్రేయస్సు కోసం క్రుషి చేశారని తెలిపారు. ఈ దేశంలో దళితులు బలహీన వర్గాలు, కార్మికుల కోసం పోరాటాలు చేస్తూ తన సాహిత్యంతో ప్రజలను నిరంతరం చైతన్యం చేశారని తెలిపారు. పాలకులకు కనువిప్పు కలిగేలా పోరాటాలు నడిపిన గొప్ప వ్యక్తి అన్నా బాహుసాటే అని తెలిపారు. ఆయన ఆశయాలు మహారాష్ట్రకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగిస్తామని, అందులో నిజామాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ, అన్నా బాహుసాటే సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు సంఘం సాయిలు, ఎన్ఎస్యూఐ నాయకులు బట్టు వేణు, అన్నా బాహుసాటే సంఘం జిల్లా నాయకులు సాయి కాంబ్లే, మేనత్కార్ శంకర్, కేశవ్ గైక్వాడ్, జట్టే గణేష్, గంగారాం, కేర్బజ్ జంగ్లే, పాండు రంగ్ పాల్గొన్నారు.
