Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 5:26 pm Posted by : ramakrishna

ఘనంగా అన్నా బాహు సాటే జయంతి

బతుకమ్మ, కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో  ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో లోక్ షాహిర్ అన్నా బావు సాటే 105వ జయంతి సందర్బంగా  అన్నా బహు సాటే  జెండాను కోటగిరి ఎంఆర్పిస్ మండల అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్ ఆవిష్కరించి అన్నా బావు సాటే చిత్ర పటానికి పూల మాలలు వేసి జయంతి ని ఘనంగా నిర్వహించారు. అనంతరం  నిజామాబాద్ ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కె .పోచిరామ్ మాట్లాడుతూ… అన్నా  బహు సాటే అసలు పేరు తుకారాం బావు రావు సాటే ఆయన1920 ఆగస్టు 1 నా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ గ్రామ మాతంగి సామాజ్ కు చెందిన వాలు భాయ్ బాబురావు సాట్ కు జన్మించిన…ఆయన గొప్ప కవి, రచయిత లోక్ షాహీర్ అని పేరు సంపాదించారని ఆయన అన్నారు. ఆయన పాటల రూపంలో గొప్ప గొప్ప రచనలను ఈ సమాజానికి అందించిన మహనీయుడు డాక్టర్ అన్న బాహూ సాటే అని ఆయన అన్నారు.  ప్రతి మాదిగ జాతి బిడ్డలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రేని సాయిలు, ప్రచార కార్యదర్శి హస్గుల విజయ్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కన్నం సాయిలు,పేగు లాలయ్య,హస్గుల లాలయ్య, హెగ్డేలి శంకర్, హోటల్ యాదవ్, కరికేల్లి సంజువ్, గంగారం కన్నం పోశెట్టి, ఎక్లాస్ పూర్ శ్రీకాంత్, ఎత్తోండ సాయిలు, సుంకిని రాజు తదితరులు పాల్గొన్నారు.