భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఏ ఏన్ ఎం లను వెంటనే రెగ్యులరైజ్ చెయ్యాలని బుధవారం కాంట్రాక్ట్ ఏ ఎన్ ఎం లు భీమ్ గల్ ప్రభుత్వ ఆసుపత్రి ముందర ధర్నా నిర్వహించారు. గత ఇరువై యేండ్లుగా మేము కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్నామని, రెగ్యులరైజ్ చేస్తమని చెప్తూ ప్రభుత్వాలు మారుతున్న మా రాతలు మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని పర్మినెంట్ చెయ్యాలన్న డిమాండ్ తో హాస్పిటల్ గేట్ వద్ద బైటయించారు. తమని పర్మినెంట్ చెయ్యాలని, తమకు న్యాయం కావాలని నినాదలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఏ ఎన్ ఎం లు పాల్గొన్నారు.