Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2025, 7:12 pm Posted by : ramakrishna

అంజిరెడ్డి, కొమురయ్యను అధిక మెజారిటీతో గెలిపించాలి

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి, కొమురయ్యను అధిక మెజారితో గెలిపించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కరీంనగర్-నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంధర్భంగా మంగళవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మండల అధ్యక్షులతో, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందూరు జిల్లా అంటే కాషాయానికి అడ్డా అని, ఈ మధ్య జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ ఫలితాలు తర్వాత రాజకీయాల్లో చాలా రకాల మార్పులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు 6 గ్యారంటీలు మరియు 420 హామీలతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు.  గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా అన్న నిరుద్యోగ భృతి 3000 రూపాయలు, లక్షా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఇచ్చిన హామీలో భాగంగా నిరుద్యోగ భృతిని 4000 వేల రూపాయలకు పెంచుతామని, 2 లక్షలకు పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలై సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, బిజెపి నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, బిజెపి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మండల అధ్యక్షులు, జిల్లా ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Anji Reddy and Komuraiah should win with a large majority