పశు సంవర్ధక శాఖ సేవలను మెరుగుపర్చాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటూ పశు సంవర్ధక శాఖ సేవలను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్సు హాల్ లో బుధవారం ఆయన పశు సంవర్ధక శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పశు సంపద కలిగిన రైతులకు అవసరమైన సేవలు అందించేలా పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెటర్నరీ డాక్టర్లు లేని...