Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 6:10 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ భవన్ లో ఘనంగా ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు రాజు మాట్లాడుతూ ఈరవత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ భవన్ నందు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది అని, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిల్ ఎల్లప్పుడు బడుగు బలహీన ప్రజల కోసం ఆలోచిస్తూ వారి అభివృద్ధి తమ సంతోషంగా భావించి పనిచేసిన నాయకుడని తెలిపారు. ఎల్లవేళల కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేసిన నాయకుడని కొనియాడారు. ఈరవత్రి అనిల్ మరింత ఎత్తుకు ఎదిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికిరణ్, శివ, హరీష్, అభిలాష్, గణేష్, పండు, ధనుషు, తేజ, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.