Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 7:10 pm Posted by : ramakrishna

విద్యుత్ అధికారుల పై ఆగ్రహం

  • మేనూర్ విద్యుత్ పరిష్కార వేదికలో సిజిఆర్ఎఫ్ చైర్ చైర్మన్ నారాయణ

 

మద్నూర్, బతుకమ్మ:  మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలోని విద్యుత్ కేంద్రం ఆవరణంలో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సి జి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమస్యల పరిష్కార వేదిక లో విద్యుత్ వినియోగదారులు ఉన్నత అధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. సమస్యల పరిష్కార వేదిక ఉన్నట్లు ఏ ఒక్క అధికారి కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. వినియోగదారులంతా అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారుల విన్నపాన్ని స్పందిస్తూ సిజిఆర్ఎఫ్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ ట్రాన్స్కో ఏ ఈ లకు వినియోగదారులు మీపై చేసిన ఆరోపణ నిజమేనా అని ప్రశ్నించారు. దీంతో వారు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడం గమనార్ధం. ఇలాంటి వేదిక పెట్టిందే సమస్యల పరిష్కారం కోసం. అలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదని చైర్ పర్సన్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు మరొక్కసారి జరగకుండా చూడాలని లేదంటే వినియోగదారులు సమాచారం ఇవ్వనట్లు తెలుపుతూ మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు చైర్ పర్సన్ ఒక సూచన చేశారు. ప్రతి సోమవారం ప్రతి ఏ ఈ ఉన్న విద్యుత్ కేంద్రం పరిధిలో ప్రజా వేదిక జరపడం జరుగుతుంది. వినియోగదారులు తమ సమస్యలను ప్రజా వేదికలో జరుపుకోవాలని సూచించారు.సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినియోగదారులు చేసిన ఫిర్యాదులపై సమస్యలు పరిష్కారం కావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సలంద్ర రామకృష్ణ మెంబర్ టెక్నికల్, లకావత్ కిషన్ మెంబర్ ఫైనాన్స్, మర్రిపల్లి రాజా గౌడ్ ఫోర్త్ మెంబర్, ఇంచార్జ్ డి ఈ విజయ సారధి, మద్నూర్ ఏ ఈ గోపికృష్ణ, మేనూర్ ఏఈ రమేష్, బిచ్కుంద సబ్ డివిజనల్ పరిధిలోని వివిధ సబ్ స్టేషన్ల ఏఈలు కరెంటు సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు.

Anger at electricity officials