Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 3:42 pm Posted by : ramakrishna

సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్ల ధర్నా

బతుకమ్మ, జుక్కల్  : బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్ కు న్యాయం జరగాలని ధర్నా నిర్వహించారు. నస్రుల్లాబాద్ సూపర్వైజర్ వాణి మేడం దౌర్జన్యాలకు బొమ్మన్ దేవుపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ అంగన్వాడి సెంటర్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. ఈ విషయమై ప్రాజెక్టు పరిధిలోని ప్రతి గ్రామ అంగన్వాడీ టీచర్ బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి అంగన్వాడీ టీచర్ సువర్ణ కు న్యాయం కావాలని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ న్యాయ విచారణ జరిపించి కచ్చితంగా న్యాయం చేస్తాం ఏ టీచర్ కూడా ఆత్మహత్యాయత్నం చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎండి. ఖలీల్ పాల్గొన్నారు.