Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 4:05 pm Posted by : ramakrishna

గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు కీలకం

  • కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ 

బాన్సువాడ, బతుకమ్మ : గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ లో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లకు పని భారం ఎక్కువైన గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు మెరుగైన సేవలు అందించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో ఉందన్నారు.

Anganwadi centers are important in villages

నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల మంజూరు కై ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కృషి చేస్తానన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమములో మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖలేక్ , అంజిరెడ్డి , ఎజాస్ , నార్ల సురేష్ , మోహన్ నాయక్ ,తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Anganwadi centers are important in villages