ప్రకృతిని పాటగా మలిచిన వాగ్గేయ కారుడు అందేశ్రీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రకృతి ఒడిలో పెరిగిన అందేశ్రీ ప్రకృతిని పాటగా మలిచిండని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో అందేశ్రీ ఫొటోకు పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. అందేశ్రీ అకాల మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప కవిని, గాయకుడిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందేశ్రీకి నిజామాబాద్ జిల్లా జనానికి అవినాభావ సంబంధం ఉన్నదని ఆయన అన్నారు. నిజామాబాద్ కు అందేశ్రీకి పేగు...