నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రష్మీ సందడి చేసింది. నగరంలోని బోర్గాం ( పి) లో శుక్రవారం రియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, రియాన్స్ మేకప్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ల ప్రారంభోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, రియాన్స్ మేకప్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ను నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యే లు దన్ పాల్ సూర్యనారాయణ, భూపతి రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాంకర్ రష్మీ మాట్లాడుతూ తమ అనుకున్న కలలుకనే చదువుతోపాటు, హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోర్సుల్లో అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో విద్యార్థులు తమ ప్రతిభ కనబరిస్తే దేశ విదేశాలలో ఉన్న హోటల్లో చేఫ్ లుగా రాణించవచ్చని అన్నారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం నిజామాబాద్ వాసులు చేసుకున్న అదృష్టమని అన్నారు. మేకప్ డిజైనింగ్ కోర్సుల్లో అద్భుతమైన భవిష్యత్తు ఉందని ఒక్కసారి రానిస్తే తాము ఇక వెనక్కి చూసేదే ఉండదని ఆమె అన్నారు. చదువుతోపాటు, ఇలాంటి రంగాల్లో రాణించి వెళ్లకుండా తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని ఆమె అన్నారు. మేకప్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ గ్రామీణ స్థాయిలో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలో, మేకప్ డిజైనింగ్ కోర్సులలో మంచి శిక్షణను అందించి ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, మేకప్ డిజైనింగ్ కోర్సులలో ఇక్కడ చదివే విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయిలో స్థిరపడాలని ఆమె ఆకాంక్షించారు.


