అనాథగా ఆలూరు బైపాస్ రోడ్డు
అభివృద్ధి పట్ల నిబద్ధత లేని కాంగ్రెస్ సర్కారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ ప్రభుత్వ ఆలనాపాలనా లేక ఆలూరు బైపాస్ రోడ్డు అనాధగా మారిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆలూరు బైపాస్ రోడ్డు, అక్కడ నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ ను గురువారం ఉదయం జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాకర్లతో, స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన...