Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 April 2025, 2:52 pm Posted by : ramakrishna

ద్వారకాకు అనంత్ అంబానీ పాదయాత్ర

వెబ్ న్యూస్, బతుకమ్మ: భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి ద్వారకాకు పాదయాత్ర చేస్తున్నారు. సుమారు 140 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన శ్రీకృష్ణుడిని దర్శించుకోనున్నారు. రోజుకు 20 కిలోమీటర్ల మేర నడుస్తున్న అనంత్.. తన కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తొద్దనే ఉద్దేశంతో రాత్రి వేళ మాత్రమే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. భారీ సెక్యూరిటీ ఆయన వెంట నడుస్తోంది. ఏప్రిల్ 10న తన పుట్టిన రోజు నాటికి అనంత్ ద్వారకాకు చేరుకోని ప్రత్యేక పూజలు చేయనున్నారు.