అపూర్వం ఆత్మీయ సమ్మేళనం

బతుకమ్మ, బిచ్కుంద : చదువులమ్మ చెట్టు నీడలో కలుసుకున్న అనుబంధం 23 సంవత్సరాల అనంతరం కూడా చెక్కు చెదరని ఆత్మీయత వారిలో కనిపించింది. బిచ్కుంద మండల కేంద్రంలోని వెంకటేశ్వర విద్యానికేతన్ పాఠశాలలో   పదవ తరగతి వరకు (2001-2002) చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పాదాల పై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. అనంతరం పూలమాలవేసి శాలువాతో సన్మానించి మెమొంటోను అందించి రాగి పాత్రలను కానుకగా ఇచ్చి పాదాభివందనం చేసి...