పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
మోస్రా, బతుకమ్మ : చిన్ననాడు ఆడిపాడుతూ చదువుకున్న చిన్నప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటూ చదువులమ్మ ఒడిలో సందడి చేశారు. మోస్రా మండల కేంద్రంలోని భారతీయ విద్యానికేతన్ హై స్కూల్ 1996-97 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్నిడీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో అపూర్వంగా జరుపుకున్నారు. చదువులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. శాలువా, పూల దండలు వేసి, మెమెంటో అందజేసి గురువులు రంగారావు అనసూయ, శివసచరణ్, హరిచర్సన్, వెంకటేష్, సంజీవ్, గోపాల్, నాగభూషణం, సాయిలు, విజేందర్, సరూప లను ఘనంగా సన్మానించారు. ఎవరు ఎక్కడ, ఏ...