బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడు మండలం శేట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు అందరు కలిసి చదువుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా స్నేహితులందరూ ఒకచోట కూడుకొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక్క దగ్గరికి అందరూ చేరుకోగానే చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని పలకరించుకున్నారు. అనంతరం వారికి విద్యనందించిన గురువులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో 2023-24 బ్యాచ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.