Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2024, 3:11 pm Posted by : ramakrishna

రెంజర్లలో అపూర్వ సమ్మేళనం

ముప్కాల్, బతుకమ్మ: మండలంలోని రెంజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  ఆదివారం 1995 – 96 బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు రెండున్నర దశాబ్దాల తరువాత కలుసుకున్న స్నేహితుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుని ఉత్సాహంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, అప్పటి ప్రధానోపాధ్యాయుడు కొండ్ర ధన్ పాల్, ఉపాధ్యాయులు గంగాధర్, సాయి రెడ్డి, సుభాషినిని సన్మానించారు.