మొరాయించిన రైల్వే గేట్
బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న రైల్వే గేటు మొరాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఎండ వేడిమిని తట్టుకోలేక ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం 12:55 గంటల సమయంలో రైల్వే గేటు మొరాయించింది. సాంకేతిక లోపంతో తెరచుకోకపోవడంతో బోధన్- బాన్సువాడ ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది గేటును తెరిచేందుకు చర్యలు చేపట్టారు.