ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్ లోని సంతోష్ ఫ్యామిలీ దాబా హోటల్ ముందు గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అతని వయసు 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉందని తెలిపారు. అతని ఒంటి పై నలుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్ పై తెలుపు రంగు చెక్స్ ఉన్నాయని అన్నారు. బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించాడని తెలిపారు. ప్రస్తుతం అతని మృతదేహం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరచడం జరిగిందని తెలిపారు. మృతుని యొక్క వివరాలు తెలిసినవారు ఈ ఫోన్ నెంబర్లకు 8712659858 సంప్రదించాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ తెలిపారు.