Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 7:08 pm Posted by : ramakrishna

అపరిశుభ్రంగా మారిన మాంసం విక్రయ శాల

  •  ప్రజల ప్రాణాలతో చెలగాటం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో మాంసం విక్రయ శాల మొత్తం అపరిశుభ్రంగా తయారైందని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం మైనారిటీలు స్థానిక ఎస్సై సాయన్న, తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. కొంత మంది మాంసం విక్రయ శాలలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చాలగటమాడుతున్నారని అన్నారు. మాంసం విక్రయ శాలలో విక్రయించిన తరువాత ఎవరూ పట్టించుకోకపోవడంతో మాంసం కొట్టిన చెక్కలను కుక్కలు నాకడం, కాకులు, కొంగలు వాలి అపరిశుభ్రంగా మారుస్తున్నా పట్టించుకోకుండా అదే చెక్కల పై మాంసం కొట్టి విక్రస్తున్నారని తెలిపారు. మాంసం విక్రయ శాలలో జంతువులు, పక్షులు ప్రవేశించకుండా ఏర్పాట్లు చేసుకునే దాకా మాంసం విక్రయం చేయకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రాన్ని అందించిన వారిలో సయ్యద్ ముళ్తాని, జాఫర్ తదితరులు ఉన్నారు.

An unhygienic butchery