శంకర్ భవన్ పాఠశాలలో విద్యార్థుల నుండి జరిమానాల వసూళ్లపై విచారణ చేపట్టాలి
ఇందూర్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలోని శంకర్ భవన్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా పీఈటి, హెచ్ఎం లు డబ్బుల వసూళ్లు చేస్తున్నారనీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్ యు నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ సురేష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యు నగర సహాయ కార్యదర్శి ఆల్గోట్ సృజన్ మాట్లాడుతూ కోటగల్లిలోని శంకర్ భవన్ పాఠశాలలో విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వివిధ...