వర్షాభావ పరిస్థితులపై ఇరిగేషన్ అధికారులతో తక్షణ సమీక్ష నిర్వహించాలి
. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు, సాగునీటి సరఫరాపై ఇరిగేషన్ శాఖ అధికారులతో తక్షణమే సమీక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఇందూరు జిల్లాలో రైతులు...