Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2025, 5:16 pm Posted by : ramakrishna

ఆర్యవైశ్య సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి

  • ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్యవైశ్య సమాజాన్ని కించపరిచేల మాట్లాడినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎన్నికల సందర్బంగా అధ్యక్షా పదవికి పోటీ చేస్తున్న ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా నగరంలోని  ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  తన ప్రత్యర్థిగా పట్టణ సంఘ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అర్వపల్లి  పురుషోత్తం గుప్త రెండు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఓడిపోతున్నా అనే ఆవేశంలో నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ  ఆర్యవైశ్య సమాజాన్ని అపహాస్యం చేసిండని మండిపడ్డారు. ఆర్యవైశ్య పట్టణ సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉందని, ఆర్యవైశ్య కుటుంబాల అభివృద్దే లక్ష్యంగా సేవే పరమవధిగా నిర్ణయం తీసుకొని తమ ఫ్యానల్  సభ్యులు పట్టణ సంఘం ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. ధన్ పాల్ అంటేనే నిజామాబాదు జిల్లాలో ఒక బ్రాండ్ ఉందని సేవకు మారు పేరుగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన తను  గతంలో నూతన వైశ్య ఉన్నత పాఠశాల అధ్యక్షునిగ,శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ సంయుక్త కార్యదర్శిగా,రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నందు పలు రకాల పదవులు నిర్వహించడమే కాకుండా 100 సంవత్సరాల చరిత్ర గల గోషాలా కోశాధికారిపని చేసిన నయ రూపాయి కరప్షన్ లేకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఆర్యవైశ్య కుటుంబాలకు, సమాజానికి మరింత సేవచేసే అవకాశం కల్పించాలని జులై 6 తారీఖున జరిగే పట్టణ ఆర్యవైశ్య సంఘ ఎన్నికల్లో తమ ఫ్యానల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పురుషోత్తం గెలిస్తే ఆర్యవైశ్య సమాజానికి ఏమి చేస్తారో చెప్పే క్లారిటీ లేక సంఘ ఎన్నికలకు రాజకీయ రంగు పులమాలని చూస్తున్నాడని దీనిని  తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, లాబిశెట్టి శ్రీనివాస గుప్తా, పెద్ది జగదీశ్వర్ గుప్తా, పబ్బ  రాజగుప్త, బరుడువార్ అనిల్ గుప్తా, వీరమల్లి రమేష్ గుప్తా, దొంతుల రాజా ప్రతాప్ గుప్తా మరియు ప్యానల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.