Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2024, 7:44 pm Posted by : ramakrishna

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :                                                                                                                                                      

డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ నిజాయితీని చాటుకున్నారు. తన విధుల్లో భాగంగా ఆదివారం రైల్వే స్టేషన్ వద్ద డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ చందులాల్ కి హ్యాండ్ బ్యాగ్ దొరికింది. బ్యాగులోని ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాగ్ ప్గొట్టుకున్న మహిళకి ఫోన్ చేసి, బ్యాగు లో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు, రూ.1200 నగదును బాధితురాలికి అప్పగించారు. దీంతో నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ చందులాల్ ను అందరూ అభినందించారు.