Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2024, 5:43 pm Posted by : ramakrishna

తెలంగాణ యూనివర్సిటి లోనే ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలి

. . . వీసీని కలిసిన ఎంఆర్ పిఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు

 డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీని అకాడమిక్ అంశాలను గాడిలో పెట్టాలని ఎంఆర్ పిఎస్, ఎంఎస్ఎఫ్  నాయకులు తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ. యాదగిరి రావును కోరారు.  శుక్రవారం ఎంఆర్ పిఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు తెయూలో విసీ ప్రొ. యాదగిరి రావును మర్యదాపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఎంఆర్ పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ మిగిలిపోయిన సీట్ల కోసం స్పాట్ కౌన్సెలింగ్ పెట్టీ భర్తీ చేయాలని, బాలికల హాస్టల్ మరొకటి నిర్మించాలని, ప్లేస్ మెంట్ ను సక్రమంగా నడపాలని కోరారు. తెయూలో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయాలని, అలాగే సారంగపూర్  బిఇడి కాలేజీ మీద దృష్టి పెట్టాలని విజ్ఞప్తి  చెశారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు దినేష్ మాదిగ, సైమన్, పాల్, నవీన్ మాదిగ, నరేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.