Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 6:37 pm Posted by : ramakrishna

పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావేత్తను గెలిపించాలి

నిజామాబాద్, బతుకమ్మ : త్వరలో జరగనునున్న ఆదిలాబాద్, కరీంనగర్,నిజామాబాద్,మెదక్ జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త నైన తనను గెలిపించాలని ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ కోరారు. గురువారం డిచ్ పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 33 ఏళ్లు అధ్యాపక వృత్తిలో పని చేసి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దానన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు,ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకగా కృషి చేస్తానన్నారు. విద్యార్ధి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, విద్యావేత్తగా తనకు అపార అనుభవం ఉందన్నారు. ఏనాడు వ్యక్తిగత స్వార్థం కోసం పని చేయలేదన్నారు. పట్టబద్రులందరికీ రోల్మాడల్గా పని చేస్తానన్నారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రంగా ఉద్యోగ నియమాకాలు చేపట్టిందని,కానీ పది నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 50వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. పట్టబద్రుల ఎన్నికల్లో అర్హత గల 7 వారందరూ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని విద్యాసాగర్ కోరారు.