ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

హైదరాబాద్, బతుకమ్మ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆటోలో ఎక్కించుకుని స్వయంగా నడుపుతూ అసెంబ్లీకి వచ్చారు. ఆటో డ్రైవర్లు ధైర్యాన్ని కోల్పోవద్దని, న్యాయం జరిగే వరకు పోరాటా చయేస్తామన్నారు.