Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 5:47 pm Posted by : ramakrishna

అర్చకునిపై దాడి అమానుషం

  • ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్. అశోక దైవ చిత్తం

 

ఆర్మూర్, బతుకమ్మ : హైదరాబాదులోని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడి పై దాడి అమానుషమని,జరిగిన దాడిని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు డాక్టర్. అశోక దైవ చిత్తం తీవ్రంగా ఖండించారు .మంగళవారం దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని  ఆయన వారి సమితి తరపున డిమాండ్ చేశారు.సమితి సభ్యులతో కలిసి పట్టణంలోని తహసిల్దార్ కు  మెమోరండం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మతం పేరిట జరిగే ఘర్షణలు మానవ మనుగడకు ప్రమాదమని, మానవత్వానికి మించిన మతం లేదన్నారు. ఆలయ అర్చకుడి పై అకారణంగా దాడి చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి రాజ్యాంగం కల్పించిన బాబా ప్రకటన స్వేచ్ఛను కాలరాసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు ‌.మతోన్మాదంతో పెట్రేగిపోతూ మానవ సమాజంలో అలజడులను సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టినప్పుడే ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఛత్తీస్గడ్ రాష్ట్రంలో క్రైస్తవులను ఊచకోస్తామని నెట్ లో వైరల్ అవుతున్న వీడియోలను సుమోటోగా తీసుకొని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాల్  జాషువా, ఉమ్మడి జిల్లా న్యాయ సలహాదారుడు జి జి రామ్, సభ్యులు కృప సత్యం, అశోక్, గోవింద్ పేట్ పిఎసిఎస్ డైరెక్టర్ సమూయేల్, ప్రకాష్ , అగస్టీన్, షడ్రక్, రమేష్ జాన్, లాజర్, వినోద్, డేవిడ్ , రాజు, విలియం లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.