సంచార జాతి కుటుంబంపై దాడి

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో బుధవారం వి డి సి పేరుతో కొందరు సంచార ఓడ్ కులానికి చెందిన కుటుంబంపై దాడి చేసి ఇల్లు కూల్చివేసిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఒకరి సొంత స్థలానికి దారి కావాలని కొంతమంది వీడీసీ సభ్యులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బ్లేడ్ ట్రాక్టర్ తో కూల్చివేశారని బాధితులు తెలిపారు. అడ్డువచ్చిన తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకొని సంచార కుటుంబానికి రక్షణ కల్పించాలని ఓడ్ కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...