Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 5:03 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్  ఖాతాలో అమ్రాద్ తండా

 

. . . సర్పంచ్ గా నందిని, ఉప సర్పంచ్ గా సంతోష్ లతో పాటు 8 వార్డులు ఏకగ్రీవం

. . . విజేతలకు ఘన సత్కరించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

మాక్లూర్,బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలం అమ్రాద్ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జై కొట్టింది. గులాబీ పార్టీకి కంచుకోటలాగా పరిగణించే అమ్రాద్ తండా వాసులంతా ఏకతాటిపై కొచ్చి బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా మెరిసేలా చేశారు. సర్పంచ్ గా నందిని, ఉప సర్పంచ్ గా సంతోష్ లతో పాటు ఎనిమిది వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అమ్రాద్ తండాలో పర్యటించిన బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విజేతలను అభినందించి ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ 2014 లో తన రాజకీయ ప్రస్థానం అమ్రాద్ తండా నుంచి ప్రారంభమైందన్నారు. తాను పోటీ చేసిన ప్రతీసారీ అమ్రాద్ తండా అండగా నిలిచిందన్నారు. ఇప్పుడు గ్రామపంచాయతీ కూడా గంపగుత్తగా బీఆర్ఎస్ పరం కావడం మాకు సంతోషంగా ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనులకు కేసీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయం ఆయన కొనియాడారు. తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు. గిరిజన జనాభా పెరిగిన దృష్ట్యా వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా కృషి చేశారని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు  భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వారికి రైతుబంధు పథకాన్ని వర్తింపజేసి కేసీఆర్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.

 

Amrad Thanda in BRS account