27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఇందూరు పంతం ఇందిరమ్మ రాజ్యం అంతం

Must read

📰 Generate e-Paper Clip

  •  హైదరాబాద్ ను ”హైడ్రా” బాద్ గా మార్చిన సీఎం రేవంత్
  • బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 

 నిజామాబాద్, బతుకమ్మ : ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  లోకల్  ’వార్’ వన్ సైడ్, కాంగ్రెస్, బీజేపీల పతనం డిసైడ్ అని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో అని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌ సర్కార్‌ మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతలు పెట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అని  అన్ని గ్రామాలు నినదిస్తున్నా యన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాల్లో కలిసి పోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ఆయన ధ్వజమెత్తారు.రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో  బుల్డోజర్ మాత్రం ఇంటింటికి వచ్చి ప్రజల బతుకులను కూల్చివేస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్  పదేళ్ల పాలన తెలంగాణ ప్రజలకు స్వర్ణ యుగం కాగా, రేవంత్ పాలన రాతి యుగాన్ని తెచ్చిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుజీత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్,మాస్త ప్రభాకర్,నక్కల భూమేష్,పూజ నరేంధర్,మెట్టు సంతోష్, రజనీష్,వెల్మల్ సురేష్,సుంకరి రవి,రంజిత్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

The Indore Panth and the end of Indiramma's reign

More articles

Latest article