28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ లో ఆరుగురికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాహనాల తనిఖీల సందర్భంగా మరియు మద్యం సేవిస్తూ బయట తిరిగిన కేసుల్లో ఆరుగురికి జైలు శిక్ష విధించారు. కొత్త బస్టాండ్‌ వద్ద వాహనాల చెకింగ్‌ సమయంలో ఘనపూర్ గ్రామానికి చెందిన జీ.రవికి రూ.1,000 జరిమానా, నాలుగు రోజుల జైలు శిక్ష, అలాగే మచ్చినూర్ గ్రామానికి చెందిన బి. మోహన్‌కు రూ.1,000 జరిమానా, రెండు రోజుల జైలు శిక్ష విధించారు. రాకాసిపేట్‌ పరిసర ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న కే.వెంకటేష్‌, కే.శంకర్‌లకు ఒక్క రోజు చొప్పున జైలు శిక్ష విధించారు. అర్ధరాత్రి సమయంలో బోధన్‌లో బయట తిరుగుతున్న షేక్‌ హుజ్‌ఫర్‌, షేక్‌ సోహెబ్‌లకు కూడా ఒక్క రోజు చొప్పున జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలను సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శేష తల్ప సాయి విధించినట్లు, బోధన్‌ ఇన్‌ఛార్జ్‌ ఎస్‌హెచ్‌ఓ భాస్కరాచారి తెలిపారు.

More articles

Latest article