27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఆర్టీసీ బస్సు డ్రైవర్ల రేసింగ్‌

Must read

📰 Generate e-Paper Clip

జమ్మికుంట నుంచి హుజూరాబాద్‌  వెళ్లే రోడ్డుపై..

కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్‌ లో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు  హల్‌చల్‌ చేశారు. జమ్మికుంట నుంచి హుజూరాబాద్‌  వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైవర్లు పోటాపోటీగా బస్సులను నడిపి రేసింగ్‌ జరిపారు. దీంతో బస్సుల్లోని ప్రయాణికులు ఆందోళనకు చెందారు. బస్సుల రేసింగ్‌ చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌ గా మారాయి.  ప్రమాదకరంగా బస్సులు నడుపుతున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

More articles

Latest article