Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 6:31 pm Posted by : ramakrishna

అన్ని సేవలలో కెల్ల సామాజిక ఆరోగ్య సేవ మర్చిపోలేనిది

 

. . . ప్రజాప్రతినిధులు ఆరోగ్య సేవ కార్యక్రమంల్లో చురుకుగా పాల్గొనాలి

 

. . . స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ

 

మనం నిజ జీవితంలో ఎన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసిన మర్చిపోతారేమో కానీ ఆపద సమయంలో మనం చేసే సామాజిక ఆరోగ్య సేవను వారి జీవితకాలం మరచిపోలేరని స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. శ్రీ విష్ణు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని ఎల్ జె ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన హెల్త్ క్యాంప్ ను విశిష్ట అతిథి నిజామాబాద్ ఐ ఎం ఏ ప్రెసిడెంట్ డాక్టర్. విశాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిత్యం తన వృత్తిలో బిజీగా ఉండే డాక్టర్లు ఎంత డబ్బు సంపాదించిన తృప్తి ఉండదని, పేదల కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినపుడే సంతృప్తి చెందుతారని అన్నారు. రోజు వారిగా బిజీగా ఉండే డాక్టర్. రమణేశ్వర్ తన ఫ్రీ టైం సండే కూడా పేద ప్రజల కోసం వెచ్చించడం చాలా గొప్ప విషయమన్నారు. భీమ్ గల్ పట్టణంలో ఈ క్యాంప్ నిర్వహించినందుకు ఆయనను అభినందించారు.

 

Among all the services, social health service is unforgettable.

 

ఇలాంటి క్యాంప్ లను బాల్కొండ కానిస్టెన్సీ లో మరిన్ని నిర్వహించాలని ఆయన కోరారు. మీరు నిర్వహించే అన్ని క్యాంప్ లకు మమ్మల్ని భాగస్వాములను చేయాలని కోరారు. తన సహచరులు, అనుచరులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ ఇలాంటి హెల్త్ క్యాంప్ ల్లో చురుకుగా పాల్గొనాలని, తమ తమ పరిధిలో ఆరోగ్య పరమైన సహాయం లో ముందుండాలని సూచించారు. అనంతరం శ్రీ విష్ణు సూపర్ స్పెషలిటీ హస్పిటల్ అధినేత డాక్టర్. రమణేశ్వర్ మాట్లాడుతూ మన జిల్లాతో పాటుగా పక్క జిల్లాలైన కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సైతం ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ లను నిరహిస్తున్నామని, ఈ క్యాంప్ ల ద్వారా పేద రోగులకు వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అంద జెస్తున్నామని అన్నారు. ఈ క్యాంప్ ల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు వస్తే వారికి మెరుగైన చికిత్స అందించేందుకు శ్రీ విష్ణు హాస్పిటల్ కు రావాలని చెప్పి తక్కువ ఖర్చుతో నయం చేసి పంపుతున్నమన్నారు. ఈ క్యాంప్ ద్వారా సుమారు 200 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్.రమణేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో పట్టణ మున్సిపల్ చైర్మన్ బొదిరే నాగమణి స్వామి, మాజీ ఎంపిపి కన్నె సురేందర్, వైస్ చైర్మన్ సంటి లత నర్సయ్య, పురానిపేట్ సర్పంచ్ బుర్ర దేవేందర్, మాజీ సర్పంచ్ కోటగిరి బాల గంగాధర్, కౌన్సిలర్లు సందీప్, అంజుమ్, నాగేంద్ర బాబు, పర్స కుశలత అనంత్ రావు, వైద్య బృందం డా. జయ ప్రకాష్, డా. మోహన్, డా. లక్ష్మి రెడ్డి, డా. విట్టల్, మేనేజ్మెంట్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Among all the services, social health service is unforgettable.