Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2024, 6:36 pm Posted by : ramakrishna

అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి, బతుకమ్మ : అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా దిష్టిబొమ్మను డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ ఆధ్వర్యంలో  పట్టణంలోని కమాన్ రోడ్డు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద  మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అమిత్ షా కించపరిచడంతోపాటు ప్రతిపక్షాలను తక్కువ చేసే విధంగా వ్యవహరించారని అన్నారు. అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేసి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అమిత్‌షా అవమానిస్తే ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పోస్ట్‌ లు పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే కేంద్రమంత్రులు పార్లమెంట్‌ ఎదురుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. లేనియెడల ఆందోళనలు ఉదృతం చేసి బిజెపి నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

Amit Shah's effigy was burnt