Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 11:07 pm Posted by : ramakrishna

అమిత్ షా సభను సక్సెస్ చెయ్యాలి

  • మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్

 

వేల్పూర్, బతుకమ్మ : ఇందూరు జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయం ను ప్రారంభించేందుకు గాను విచ్చేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభను సక్సెస్ చేయాలని మండల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ పార్టీ శ్రేణుల కోరారు. మంగళవారం మండలంలోని లక్కోరా గ్రామ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న జరిగే సభకు భారీ స్థాయిలో రైతులను, కార్యకర్తలను తరలించాలని సూచించారు. ఈ సమావేశం లో మండల ప్రధాన కార్యదర్శి లాబిశెట్టి భానుచందర్ మండల ఉపాధ్యక్షుడు కొట్టాల శ్రీనివాస్ ఉమ్మేడ మల్లికార్జున్ అడ్వాల శ్రీనివాస్ భూత అధ్యక్షులు బూతు అధ్యక్షులు మహేష్ శ్రీనివాస్ తిరుపతి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.