అమిత్ షా ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి
దళిత సంఘాల డిమాండ్ బతుకమ్మ, బిచ్కుంద : పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా దళిత గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత, గిరిజన, అణగారిన వర్గాలు, వివక్షకు గురౌతున్న ప్రజలందరికీ న్యాయం జరగాలని, సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కోసం పాటుపడిన అంబేద్కర్పట్ల వ్యంగ్యంగ కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడటం మంచిది...