Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 5:34 pm Posted by : ramakrishna

అమిత్ షా ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి

దళిత సంఘాల డిమాండ్ 

బతుకమ్మ, బిచ్కుంద : పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా దళిత గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత, గిరిజన, అణగారిన వర్గాలు, వివక్షకు గురౌతున్న ప్రజలందరికీ న్యాయం జరగాలని, సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కోసం పాటుపడిన అంబేద్కర్పట్ల వ్యంగ్యంగ కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ  వెంటనే స్పందించి కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను వెంటనే తొలగించాలని, అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని, అలాగే భారతీయ జనతాపార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు అంబేద్కర్ ను  దైవంగా భావిస్తారని తమ బతుకులు మార్చిన మహనీయుడని, రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు కల్పించి సమానత్వం కోసం కృషి చేసిన అంబేద్కర్ ను దైవంగా భావిస్తారని అలాంటి మహనీయుని పట్ల అమిత్ షా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బొగడ మీది సాయిలు, బుక్కవర్ రాంచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్, ఎమ్మార్పీఎస్ నాయకులు మేత్రి హన్మాండ్లు, దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Amit Shah should be removed from the post of minister