జీనోమ్ వ్యాలీలో యామ్జెన్ అత్యాధునిక పరిశోధన కేంద్రం
హైదరాబాద్, బతుకమ్మ : గ్లోబల్ బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ యామ్జెన్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో యామ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుళ్లపల్లి, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు....