Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 7:23 pm Posted by : ramakrishna

అంబులెన్స్ ల రవాణాకి ఇబ్బంది లేకుండా చూడాలి

 

. . . జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షలో సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలోని జనరల్ ఆసుపత్రి బయట ఉన్న షాప్ ల వలన ఆసుపత్రికి రావాల్సిన అంబులెన్స్ లను ఇబ్బంది ఎదురవుతుందని, ఇక పైనా అలాంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశించారు. శనివారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన సూపరిండెంట్ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ రాజశ్రీ తో చర్చించారు. దీంట్లో భాగంగా గతంలో ఆసుపత్రిలో జరిగిన ఆత్మహత్యలకు సంబంధించి, తదుపరి ఆత్మహత్యలను నివారించడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా హాస్పిటల్లో పార్కింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాలు ఏర్పాటు, తదితర సమస్యలపై సవివరంగా చర్చించారు. అలాగే గతంలో జరిగిన చిన్నపిల్లల అపహారణలు, బయట వ్యక్తులు పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి వెళ్తున్న వెహికల్ లను కట్టడి చేసే విషయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.