బైక్‌లను ఢీ కొన్న అంబులెన్స్

బెంగళూరు, బతుకమ్మ :  బెంగళూరు రిచ్‌మండ్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్‌లను అంబులెన్స్ ఢీ కొంది. ఈఘటన లోనే ఇస్మాయిల్, సమీన్ భాను దంపతులు అక్కడికక్కడే  మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికులు  ఆగ్రహంతో అంబులెన్స్ ను ఎత్తిపడేశారు.