కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేకుంటే ఈనాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఉండేది కాదని,  కరెన్సీ పై అంబేద్కర్ చిత్రాన్ని  ముద్రించాలని అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెర్రిపోతుల పరశురామ్ అన్నారు.  నగరంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలగా, 1923లో బీఆర్ అంబేద్కర్  సగటు వ్యక్తి కోణంలో ఆలోచించి ‘రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం’ అనే పుస్తకాన్ని రాసి హిల్టాన్ యంగ్ కమిషన్,...