ఇజ్రాయిల్ లో అంబేద్కర్ వర్ధంతి
నిజామాబాద్, బతుకమ్మ: ఇజ్రాయిల్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అసోసియేషన్ సభ్యుడు నీరడి ప్రేమానంద్ (వెంకటాపూర్) మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో అంబేద్కర్ వెలుగులు నింపారని, రాజ్యాంగం ద్వారా సమానత్వం ప్రసాదించిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ సభ్యులు రతీశ్, ఈర్గల సుమన్ కుమార్, ధీరజ్, జూల విజయ్, దయాలింగం, పోతె రాకేశ్, జయసూర్య, రాము, ప్రశాంత్, సన్నీ, సవీన్, మహిపాల్,...