Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 3:02 pm Posted by : ramakrishna

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్, కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు గైని గంగారాం, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, కేంద్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీశ్, జిల్లా కోశాధికారి సుంకరి దినేశ్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు అతీక్ అహ్మద్, జిల్లా సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు విశాల్ రెడ్డి, ఉమాకిరణ్, గురుచరణ్, పార్థసారథి, టీఎన్జీవోస్ సలహాదారు వనమాల సుధాకర్, క్లాస్ ఫోర్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ల శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.