నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా భీమ్ ఆర్మీ, సన్ రైస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం 43వ డివిజన్ స్థానిక పాముల బస్తిలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిజాంబాద్ జిల్లా తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు అలుక కిషన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హెల్త్ క్యాంప్ లో స్థానిక ప్రజలకు బిపి, షుగర్, థైరాయిడ్, ఈసీజీ టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరిగింది. ప్రజల ఆరోగ్యం గురించి వివిధ రోగాలకు సంబంధించి అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా కార్యదర్శి బత్తుల కిష్టయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం, సంక్షేమం కోసం భీమ్ ఆర్మీ కృషి చేస్తుందని వారికి ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. అంబేద్కర్ అందించిన స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాదాలే అజయ్, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త సిహెచ్ వెంకటరమణ, పట్టణ అధ్యక్షులు విజయ్ సాలుంకే, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ గైక్వాడ్, బిలేందర్ సింగ్, వికాస్, అనిల్, సోన్, కామ్రే రాజు , యాదగిరి , లింగయ్య, దేవయ్య ,బిక్షపతి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
