. . . భారత రాజ్యాంగ నిర్మాతకు ఎంఆర్పీఎస్ ఘన నివాళులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాజ్యాంగంలో సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, సోదరభావాన్ని రచించి భారత్ దేశ ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా సోదర భావంతో బ్రతకాలని అంబేద్కర్ ఆశించారని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలోని పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎంఆర్పీఎస్ బృందం పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ లేకపోతే ఈ దేశానికి రాజ్యాంగం లేకుండా మత దేశంగా మారేదని అన్నారు.

ఈ దేశంలో ఉన్న వివక్షాల మీద నిత్యం పోరాటం చేసి దళిత ప్రజలకు దేవుడయ్యాడని అన్నారు. రాజ్యాంగంలో మత స్వేచ ఇచ్చారని, కానీ సుప్రీం కోర్టు ద్వారా మత స్వేచ్ఛను లేకుండా పాలకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ కుట్రలను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జాతీయ నాయకులు యమున మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మారుతి మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకులు సావిత్రి మాదిగ, సుధ మాదిగ, స్వప్న మాదిగ, తదితరులు పాల్గొన్నారు.