Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 6:54 pm Posted by : ramakrishna

దళితుల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు అంబేద్కర్

 

. . . నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దళితుల హక్కుల కోసం, అంటరానితనం కోసం పోరాడిన మహానీయుడు డా.బి.ఆర్ అంబేడ్కర్ అని నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. మంగళవారం బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ లో ఆయన చిత్రపటానికి, పులాంగ్ చౌరస్తా లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఏ దేశానికి లేని విధంగా భారతదేశానికి రాజ్యాంగం రాసిన మహానీయుడు అంబేద్కర్ అని అన్నారు. రాజ్యంగా నిర్మాత, కుల వివక్షపై పోరాడి, దళితులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, స్వేచ్ఛ, సమానత్వం అనే భావాలు నేటికి భారత సమాజానికి దిశానిర్దేశమని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయం కృషితో అత్యున్నత పదవులను అదిష్టించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నుడ చైర్మన్ కేశ వేణు, మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జావీద్ అక్రమ్, డిల్లీ భక్తవస్తలం, విపుల్ గౌడ్, యాదగిరి, శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

 

Ambedkar, the great man who fought for the rights of Dalits