నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యువజన కాంగ్రెస్ సంఘం ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లి బిసి బాలికల హాస్టల్ లో విద్యార్థునులకు పుస్తకాలు, పెన్నులు పంపిణి చేసారు. ఈ సందర్బంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో సామాజిక సమానత్వం, అన్యాయాల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన అన్నారు. దేశ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలను,యువతలో అంబేద్కర్ గారి ఆలోచనలు, సిద్ధాంతాల పట్ల అవగాహన పెంపొందించడం యూత్ కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. అంబేద్కర్ అందించిన విలువల్ని ఈ తరం యువతలోకి తీసుకెళ్లే లక్ష్యంతో చర్చలు, అవగాహన సదస్సులు ఇతర కార్యక్రమాలు భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతాయని ఆయన అన్నారు. సామాజిక న్యాయం, విద్య, స్వాభిమాన జీవితం వంటి అంశాల్లో అంబేద్కర్ చూపించిన మార్గాన్ని అనుసరించి నడవాలని ఈ సందర్భంగా ఆయన యువతకు పిలుపు ఇచ్చారు. జాతీయ కాంగ్రెస్ పిలుపుమేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామానికి గాంధీ ఆలోచనలతో పాటు అంబేద్కర్ ఆలోచనలను ఆయన సమాజానికి చేసిన సేవలను గ్రామ గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అద్నాన్, ప్రధాన కార్యదర్శులు ఇర్ఫాన్, ఆదిత్య పాటిల్ ,అర్బన్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సృజన్ , శుభం , నార్త్ మండల్ అధ్యక్షులు దినేష్, సాగర్, ముషు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
